ఓ వైపు పరాజయాలు మరోవైపు ఐసీసీ చర్యలు
మహిళల వన్డే ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచులలో విజయం సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్ లో తొలి రెండు మ్యాచులలో విజయం సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచులలో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇంతలో భారత్‌కు మరో షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో మ్యాచులో టీమిండియా స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో 5 శాతం కోత విధించింది ఐసీసీ. నిర్దేశిత సమయంలో భారత బౌలర్లు ఓ ఓవర్ తక్కువగా వేసినట్లు ఐసీసీ గుర్తించింది. భారత్ తమ తదుపరి మ్యాచులో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మిగతా జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా సెమీ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్ తో పాటు మిగిలిన రెండు మ్యాచుల్లోనూ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.