కావాలనే లారా రికార్డుకు దూరంగా డిక్లరేషన్
జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
జింబాబ్వేతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్రియాన్ లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. టెస్టుల్లో లారా అత్యధికంగా 400 రన్స్ చేశాడు. అయితే ఆ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా ముల్డర్ మాత్రం అనుకోలేదు. బ్రియాన్ లారా మీద ఉన్న గౌరవం వల్లే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు చెప్పాడు. దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్‌లో 626 రన్స్ చేసింది. అయితే ఓ క్రికెట్ లెజెండ్ మీద ఉన్న అభిమానంతో డిక్లరేషన్ ఇచ్చి దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్ ప్రేమికుల హృదయాలను గెలుచుకుంది.