IPL 2025 : నేడు ఐపీఎల్ లో ఢిల్లీ వర్సెస్ కోల్ కత్తా

నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఢీకొంటుంది

Update: 2025-04-29 02:37 GMT

ఐపీఎల్ 18 వ సీజన్ చివరి దశకు వచ్చేసరికి అనేక ఆశ్చర్యకరమైన ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ విజయంతో దూసుకు వచ్చిన జట్లు ఇప్పుడు విజయం కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే ఆరంభంలో అదరగొట్టిన జట్లు ఇప్పుడు డీలా పడ్డాయి. ప్రారంభంలో తడబడినా తేరుకుని కొన్ని జట్లు ముందుకు వెళుతున్నాయి. ప్లే ఆఫ్ కు చేరుకునే సమయం దగ్గరపడటంతో ప్రతి జట్టు ప్రతి మ్యాచ్ లో గెలిచి నిలవాలని కోరుకుంటుంది. అందుకే ఇక జరగబోయే మ్యాచ్ లన్నీ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నాయి.

నేడు రెండు జట్లకూ కీలకమే...
నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ ఢీకొంటుంది. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఢిల్లీ ఇప్పటికే మంచి ఊపు మీదుంది. తొమ్మిది మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఆరు మ్యాచ్ లలో గెలిచి మూడింటిలో ఓడి పన్నెండు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా తొమ్మిది మ్యాచ్ లు ఆడి కేవలం మూడింటిలోనే గెలిచింది. ఐదు మ్యాచ్ లలో ఓడింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక పాయింట్ దక్కింది. దీంతో ఏడు పాయింట్లతో ఉంది. ఈ మ్యాచ్ లో గెలుపు రెండు జట్లకూ అవసరమే. అగ్రస్థానానికి ఎగబాకటానికి ఢిల్లీ కాపిటల్స్, ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకోవడానికి కోల్ కత్తా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ ను గెలవాల్సి ఉంది.


Tags:    

Similar News