IPL 2025 : నేడు డూ ఆర్ డై మ్యాచ్
నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడుతుంది
నేడు ఐపీఎల్ లో కీలక మ్యాచ్ జరగనుంది. ముంబయి ఇండియన్స్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడుతుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ప్లే ఆఫ్ లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నిసున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసుకు మూడు జట్లు చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మొదటి మూడు స్థానాల్లో ఉండటంతో నేడు నాలుగో స్థానం కోసం ఢిల్లీ, ముంబయి లు పోటీ పడుతున్నాయి.
ముంబయి గెలిస్తే...
అందుకే నేడు ముంబయిలో జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తే నాలుగో స్థానంలో ప్లే ఆఫ్ రేసుకు చేరుకునే అవకాశాలున్నాయి. ముంబయి ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకుంటుంది. ఢిల్లీ పోటీ నుంచి తప్పుకుంటుంది. అదే ఢిల్లీ గెలిస్తే నాలుగో స్థానం కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. అందుకే డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఇరు జట్లు ప్లే ఆఫ్ బెర్త్ కోసం ప్రయత్నించనుండటంతో ఈ మ్యాచ్ అలరిస్తుంది. ముంబయి ఇండియన్స్ తన సొంత మైదానంలో ఆడుతుండటంతో కొంత అడ్వాంటేజీ ఉంటుందని అంటున్నారు. ఈ రెండు చివరగా పంజాబ్ కింగ్స్ తో తలపడతాయి.