కోహ్లీ అరుదైన రికార్డు.. సోషల్ మీడియాలో 310 మిలియన్ల ఫాలోవర్లు
అంటే ఇప్పుడు ఒక్క ట్విట్టర్లోనే కోహ్లీని 5 కోట్లమంది ఫాలో అవుతున్నారు. 33 ఏళ్ల కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో 211 మిలియన్లు..
మూడేళ్లుగా పేలవంగా ఆడుతూ.. అభిమానులను నిరాశ పరిచిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆసియా కప్ లో ఆప్ఘనిస్థాన్ పై సెంచరీ కొట్టి.. తిరిగి గాడిలో పడ్డాడు. కోహ్లీ అరుదైన ఘనతను సాధించాడు. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో 310 మిలియన్లకు పైగా కోహ్లీని ఫాలో అవుతున్నారు. తాజాగా ట్విట్టర్లో 50 మిలియన్ల ఫాలోవర్లతో సరికొత్త రికార్డును కైవసం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
అంటే ఇప్పుడు ఒక్క ట్విట్టర్లోనే కోహ్లీని 5 కోట్లమంది ఫాలో అవుతున్నారు. 33 ఏళ్ల కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో 211 మిలియన్లు, ఫేస్ బుక్ లో 49 మిలియన్ల మంది ఫాలోవర్లను కలిగి ఉన్నాడు. ఫుట్ బాల్ దిగ్గజాలైన క్రిస్టియానో రొనాల్డో (450 మిలియన్లు), లియోనెల్ మెస్సీ (333 మిలియన్ల) తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్లు అనుసరించే మూడో క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం. మొత్తం మీద 31 కోట్ల మంది భారత క్రికెట్ దిగ్గజమైన విరాట్ కోహ్లీని సోషల్ మీడియాలో అనుసరిస్తున్నారు.