IPL 2026 L నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్
నేడు ముంబయి ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది
ఐపీఎల్ లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. నేడు ముంబయి ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబయి వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబయి ఇండియన్స్ ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరెట్ గా ఉండనుంది. సొంత మైదానంతో పాటు బలమైన జట్టుగా బరిలోకి దిగనుంది.
ముంబయి ఇండియన్స్ బలంగా...
ముంబయి ఇండియన్స్ తన తొలి మ్యాచ్ లోనే కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించి బోణీ కొట్టాలని భావిస్తుంది. అయిదుసార్లు ఛాంపియన్ గా ఉన్న ముంబయి ఇండియన్స్ హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో బరిలోకి దిగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా ఈ మ్యాచ్ లో గెలవాలని శక్తికొద్దీ పోరాడుతుంది. అయితే హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ గాయాలపాలు కావడంతో బౌలింగ్ లో బలహీనంగా ఉన్న నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు.