క్రికెట్‌ ఆ్రస్టేలియా.. 60 కోట్ల నష్టం

‘యాషెస్‌’ సిరీస్‌ కు మంచి ఆదరణ లభిస్తున్నా ఆర్థికంగా మాత్రం క్రికెట్‌ ఆ్రస్టేలియాకు నష్టాలు వస్తున్నాయి.

Update: 2025-12-29 10:19 GMT

‘యాషెస్‌’ సిరీస్‌ కు మంచి ఆదరణ లభిస్తున్నా ఆర్థికంగా మాత్రం క్రికెట్‌ ఆ్రస్టేలియాకు నష్టాలు వస్తున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు టెస్టుల్లో మూడు ఆసీస్‌ గెలిచి సిరీస్‌ నిలబెట్టుకుంది. వీటిలో రెండు టెస్టు మ్యాచ్‌లు రెండు రోజుల్లోనే ముగిశాయి. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు రోజుల్లోనే ఫలితం వచ్చింది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ లో జరిగిన నాలుగోదైన ‘బాక్సింగ్‌ డే’ టెస్టు మ్యాచ్‌ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ సిరీస్ కు సంబంధించి మూడో రోజు, నాలుగో రోజు టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు నిరాశ ఎదురవ్వడమే కాదు.. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడంతో క్రికెట్‌ ఆ్రస్టేలియా 60 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

Tags:    

Similar News