IPL 2025 : చెన్నై గెలిచి తనతో పాటు కోల్ కత్తాను కూడా జత చేసుకుందిగా

చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది

Update: 2025-05-08 02:17 GMT

ఐపీఎల్ 18 సీజన్ లో విచిత్రాలు జరుగుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కు చాలా రోజులకు విజయం లభించింది. తాను గెలిచి తనతో పాటు మరో జట్టును కూడా ప్లేఆఫ్ రేస నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో పెద్దగా రాణించకపోవడంతో వరస ఓటములు ఎదురయి ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి దూరమయింది. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కోల్ కత్తాలో జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించింది. అయితే దీనివల్ల కోల్ కోత్తా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ రేసుకు చేరాలంటే చాలా క్లిష్టతరం చేసేసింది. తాను పోతూ.. పోతూ.. మరొక జట్టును కూడా ఈ సీజన్ నుంచి దూరం చేసిందనే చెప్పాలి. అయితే ఇది మ్యాచ్ కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు మాత్రం చెన్నై గెలవడంతో ఒకింత ఊరట కలిగినట్లయింది.

తక్కువ స్కోరుతో...
టాస్ గెలిచిన కోల్ కత్తానైట్ రైడర్స్ తన సొంత మైదానం కావడంతో ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ బ్యాటింగ్ లో ఘోరంగా సొంత గడ్డపై విఫలమయింది. కోల్ కత్తానైట్ రైడర్స్ జట్టుో గుర్బాజ్ పదకొండు పరుగులు చేసి వెనుదిరిగాడు. నరైన్ కూడా ఎంఎస్ ధోని అద్భుతమైన స్టంపిగ్ తో 26 పరుగులు చేసి వెనుదిరిగాడు. రహానే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 48 పరుగులు చేయగలిగాడు. రఘువంశీ కూడా ఒక పరుగు వద్ద సూపర్ స్టంపింగ్ తో వెనుదిరిగాడు. మనీష్ పాండే నాటౌట్ గా నిలిచి 36 పరుగులు చేశఆడు. రసెల్ కాసేపు ఉన్నా విజృంభించి ఆడి 38 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తొమ్మిది, రమణదీప్ నాలుగు పరుగులు చేయడంతో కోల్ కత్తానైట్ రైడర్స్ ఇరవై ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ లో నూర్ నాలుగు వికెట్లు తీసి కోల్ కత్తా వెన్ను విరిచాడు.
చెన్నై ఈ విజయంతో...
తర్వాత 180 పరుగుల లక్ష్యంతో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ ఆదిలో ఇబ్బందులు పడ్డారు. ఆయుష్ డకౌట్ తో వెనుదిరిగాడు. ఉర్విల్ అరుణ్ 31 పరుగులు చేశాడు. అశ్విన్ ఎనిమిది పరుగులు చేశాడు. జడేజా 19 పరుగులకే పరిమితమయ్యాడు. బ్రెవిస్ మాత్రం విజృంభించి ఆడి 52 పరుగులు చేశాడు. శివమ్ దూబె 45 పరుగులు చేశాడు. ధోని నాటౌట్ గా నిలిచి 17 పరుగులు చేశాడు. నూర్ రెండు, అన్షుల్ కాంబోజ్ నాటౌట్ గా నాలుగు పరుగులు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచినా మరో జట్టు కోల్ కత్తానైట్ రైడర్స్ ప్లే ఆఫ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. కోల్ కత్తా నైట్ రైడర్స్ ఇప్పటి వరకూ పన్నెండు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచి ఆరింటిలో ఓడి పది పాయింట్ల అట్టడుగున నిలిచింది. అది ప్లే ఆఫ్ కు రావాలంటే అద్భుతాలు జరగాల్సిందే.
Tags:    

Similar News