IPL 2025 : ఆలస్యం అయింది భయ్యా.. ఇప్పుడు పుంజుకుని ఏం లాభం?
అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది.
ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత ఇప్పుడు జట్లు ఫామ్ లోకి వచ్చాయి. గతంలో అన్ని జట్లపై ఓటములు చవి చూసిన జట్లు ఇప్పుడు ఉన్నట్లుండి పుంజుకున్నాయి. కానీ అప్పటికే సమయం మించి పోయింది. ఎందుకంటే ప్లే ఆఫ్ రేసులో బెర్త్ కన్ఫర్మ్ అయిన తర్వాత జరుగుతున్న మ్యాచ్ లలో గెలిచినా ప్రయోజనం లేదు. అయినా సరే.. తమ జట్ల అభిమానుల కోసం చివరి ప్రయత్నంగా చాలా జట్లు చివరి నిమిషంలో చెలరేగి ఆడుతూ విజయాలు సాధిస్తున్నాయి. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఓడించింది. అయితే ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇక గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది.
భారీ పరుగులు చేసి...
తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా ప్రయోజనం లేదు. అయినా సరే అభిమానుల సంతృప్తి కోసం ఆడాల్సిందే. ఆ గెలుపుతో వచ్చే సీజన్ లో అయినా పుంజుకుంటామని తెలియజెప్పడానికి సంకేతాలు పంపగలిగింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ లో మాత్రే 34 పరుగులు చేశాడు. కాన్వే యాభై రెండు పరుగులు చేశాడు. ఉర్విల్ 37 పరుగులు చేశాడు. శివమ్ దూబె పదిహేడు పరుగులు, బ్రెవిస్ 57 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక జడేజా నాటౌట్ గా నిలిచి 21 పరుగులుచేయడంతో జట్టు స్కోరు భారీగా పెరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేయగలిగింది.
ఛేదనలో తడబడి...
ఇది గుజరాత్ టైటాన్స్ కు పెద్ద లక్ష్యమే. ఎందుకంటే 230 పరుగులు చేయడం అంటే తొలి ఓవర్ నుంచి రన్ రేట్ ను పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ ఛేదనలో కొంత తడబడింది. సాయి సుదర్శన్ 41 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. గిల్ 13 పరుగులే వెనుదిరిగాడు. రూథర్ ఫర్డ్ డకౌట్ తో పెవిలియన్ బాట పట్టాడు. షారూఖ్ 19 పరుగులు, తెవాతియా పథ్నాలుగు పరుగులు చేసి అవుటయ్యారు. రషీద్ పన్నెండు పరుగులు చేసి అవుటయ్యాడు. కొయెట్టీ ఐదు పరుగులు చేశాడు అర్షద్ ఇరవై పరడులు చేశఆడు. సాయి కిశోర్ మూడు, సిరాజ్ నాటౌట్ గా నిలిచి మూడు పరుగులు చేయడంతో గుజరాత్ టైటాన్స్ పని అయిపోయింది. 18.3 ఓవర్లలోనే గుజరాత్ టైటాన్స్ ఆల్ అవుట్ అయి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 83 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.