టీం ఇండియా బంగ్లాదేశ్ టూర్ రద్దు?

టీం ఇండియా బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి సూచించినట్లు తెలిసింది.

Update: 2025-07-04 06:59 GMT

టీం ఇండియా 

టీం ఇండియా బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి సూచించినట్లు తెలిసింది. ఆగస్టు నెలలో టీం ఇండియా బంగ్లాదేశ్ లో పర్యటించాల్సి ఉంది. ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభయ్యే ఈ పర్యటనలో బంగ్లాదేశ్ తో మూడు వన్డేలు, మూడు టీ 20లు టీఇండియా ఆడాల్సి ఉంది. ఇందుకోసం పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం టూర్ ను విరమించుకోవాలని సూచించినట్లు సమాచారం.

కేంద్రం సూచనలతో..
బంగ్లాదేశ్ - భారత్ ల మధ్య ఇటీవల కాలంలో సంబంధాలు దెబ్బతినడంతో పాటు అక్కడ టీం ఇండియా ఆటగాళ్లకు భద్రత లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి పర్యటనను రద్దు చేసుకోవాలని సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే దీనిపై బీసీసీఐ అధికారికంగా త్వరలోనే ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలిసింది.


Tags:    

Similar News