రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంపై కేసు నమోదు

ఎం.చిన్నస్వామి స్టేడియం ఎదుట జరిగిన తొక్కిసలాటలో

Update: 2025-06-05 14:59 GMT

ఎం.చిన్నస్వామి స్టేడియం ఎదుట జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడిన ఘటనకు సంబంధించి బెంగళూరు పోలీసులు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, DNA నెట్‌వర్క్స్, ఇతరులపై కేసు నమోదు చేశారు.

కబ్బన్ పార్క్ పోలీసులు ఈ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. దీనిని సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శేఖర్ హెచ్.టెక్కన్నవర్ ధృవీకరించారు. దీనిని సుమోటోగా నమోదు చేశారు. నేరపూరిత నిర్లక్ష్యం కేసులో అనేక సంస్థలను నిందితులుగా చేర్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత RCB జట్టును సత్కరించడానికి బుధవారం జరిగిన బహిరంగ కార్యక్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. లాజిస్టికల్ మరియు భద్రతా కారణాల దృష్ట్యా బెంగళూరు పోలీసులు ఆదివారం నాడు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించాలని సిఫార్సు చేసినప్పటికీ, RCB విజయం సాధించిన మరుసటి రోజే కర్ణాటక ప్రభుత్వం సత్కార కార్యక్రమాన్ని నిర్వహించిందని తెలుస్తోంది.


Tags:    

Similar News