Asia Cup : ఆసియా కప్ కు ఆటగాళ్ల ఎంపిక ఎలా ఉందంటే?
ఆసియా కప్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. పదిహేను మందితో జట్టును ఎంపిక చేసింది.
ఆసియా కప్ కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లు సమావేశమై ఆసియా కప్ కు వెళ్లే పదిహేనుమందితో కూడిన జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు శుభమన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఆసియా కప్ వచ్చే నెల 9వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ యూఏఈ వేదికగా జరగనుంది. అన్ని మ్యాచ్ లు టీ 20 ఫార్మాట్ లోనే జరగనున్నాయి. ఐపీఎల్ లో సత్తా చాటిన వారిని ఏరి కోరి ఎంపిక చేసి మరీ జట్టును కూర్పు చేశారు.
భారత్ జట్టు ఇదే...
ఆసియా కప్ లో భారత జట్టు లీగ్ దశలో మొదటి మ్యాచ్ ను సెప్టెంబరు10వ తేదీన ఆడనుండగా, సెప్టెంబర్ 14వ తేదీన పాకిస్థాన్ తోను చివరి లీగ్ మ్యాచ్ 19వ తేదీన ఒమన్ తోనూ తలపడనుంది. జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తారు. వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ ఉంటారు. ఈజట్టులో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బూమ్రా, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్ లు ఉంటారు.