విరాట్ కోహ్లీ నిర్ణయంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే !

కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంలో బీసీసీఐ హస్తం లేదని గంగూలీ స్పష్టం చేశారు. వన్డేల కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించినప్పుడు..

Update: 2022-01-16 11:29 GMT

టీమిండియా క్రికెట్ జట్టు బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ.. ఉన్నట్లుండి టెస్ట్ మ్యాచ్ ల కెప్టెన్సీకి రాజీనామా చేయడం ఆయన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మూడు నెలల క్రితం మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా ఉన్న కోహ్లి ఇప్పుడు బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే జట్టులోకి రానున్నాడు. కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీ తీసుకున్న నిర్ణయంపై, అభిమానుల నుంచి అనుభవజ్ఞుల వరకు సోషల్ మీడియాలో ఆశ్చర్యపోతూ కామెంట్లు చేశారు. కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయంలో బీసీసీఐ హస్తం లేదని గంగూలీ స్పష్టం చేశారు. వన్డేల కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించినప్పుడు.. గంగూలీ అభిమానాలే లక్ష్యంగా చేసుకున్నాడు. " విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, ఆటలోని ప్రతి ఫార్మాట్‌లో భారత క్రికెట్ విజయాలు సాధించింది. ఇది అతని వ్యక్తిగత నిర్ణయమని, బీసీసీఐ దానిని గౌరవిస్తుంది. జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో అతను టీమ్ ఇండియాలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు. గొప్ప ఆటగాడు " అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు గంగూలీ. ఈ ట్వీట్ పై కోహ్లీ అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


Tags:    

Similar News