IPL 2025 : ఐపీఎల్ తిరిగి ప్రారంభమయితే మ్యాచ్ లు ఇక్కడే.. దక్షిణాది సేఫ్
ఐపీఎల్ 18 సీజన్ ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. ఇందుకు మూడు నగరాలను ఎంపిక చేసింది
IPL matches
పాకిస్తాన్ - భారత్ ల మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో ఐపీఎల్ ను తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన పదహారు మ్యాచ్ లునిర్వహించాడానికి బీసీసీఐ కొన్ని నగరాలను ఎంపి చేసింది. ఆగిపోయిన మ్యాచ్ లను హైదరబాద్, బెంగళూరు, చెన్నైలలో జరపాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది.
ఆగిపోయిన మ్యాచ్ లు...
అయితే ఆగిపోయిన ఈ మ్యాచ్ లు ఎప్పుడు ప్రారంభమవుతాయని మాత్రం ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. ఉద్రిక్తతలు తగ్గిన వెంటనే మ్యాచ్ లను తిరిగి ప్రారంభించి ఐపీఎల్ సీజన్ 18 ను ముగించాలని బీసీసీఐ ప్రాధమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. తిరిగి ప్రారంభమయ్యే తేదీలను, వేదికలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.