India : విశ్వవిజేతకు బీసీసీఐ భారీ గిఫ్ట్
మహిళల వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన మహిళల జట్టుకు బీసీసీఐ భారీ గిఫ్ట్ ఇచ్చింది.
మహిళల వరల్డ్ కప్ లో విశ్వవిజేతగా నిలిచిన మహిళల జట్టుకు బీసీసీఐ భారీ గిఫ్ట్ ఇచ్చింది. భారీ మొత్తంలో నగదు బహుమతిని ప్రకటించింది. దక్షిణాఫ్రికాపై ముంబయిలో సాధించిన అపూర్వ విజయానికి బీసీసీఐ భారత మహిళల జట్టుకు యాభై కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించింది. యాభై ఒక్క కోట్ల రూపాయలను నజరానాగా ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
యాభై రెండు పరుగుల తేడాతో...
యాభై రెండు పరుగుల తేడా తో విజయం సాధించడంతో యాభై ఒక్క కోట్ల రూపాయలను బీసీసీఐ భారత మహిళల జట్టుకు ప్రకటిచింది. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ భారత మహిళల జట్టుకు అభినందనలు తెలిపారు. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టును ప్రధాని అభినందించారు.