IPL 2025 : ఐపీఎల్ మ్యాచ్ లు17 నుంచి ప్రారంభం

క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది

Update: 2025-05-13 02:41 GMT

IPL matches

క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. కొత్త షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసింది. ఐపీఎల్ సీజన్ 18 జూన్ మూడో తేదీన ఫైనల్స్ జరుగుతుంది. ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభమయిన తర్వాత తొలి మ్యాచ్ ఈ నెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది.

ఆరు వేదికలను ఖరారు చేసి...
ఈ మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. ఆగిపోయిన పదిహేడు మ్యాచ్ లు దేశంలోని ఆరు ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబయిలలో మ్యాచ్ లు జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ప్లే ఆఫ్ మ్యాచ్ ల తేదీ వివరాలను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ చెప్పింది. ధర్మశాలలో నిలిచిపోయిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ కాపిటల్స్ మ్యాచ్ ను తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఐపీఎల్ సీజన్ 18 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది.


Tags:    

Similar News