IPL : గుజరాత్ లోనే ఐపీఎల్ ఫైనల్స్
ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది.
IPL matches
ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే ఫైనల్స్ మాత్రం గుజారాత్ లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల బీసీసీఐ కొత్త షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ సీజన్ 18 జూన్ మూడో తేదీన ఫైనల్స్ జరుగుతుంది.
అహ్మాదాబాద్ లోని...
గుజరాత్‌లో ఐపీఎల్ ఫైనల్ జరపాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుందని తెలిసింది. కోల్‌కత్తా వేదికగా జరగాల్సిన ఫైనల్స్ అహ్మదాబాద్‌కు మార్పు చేసినట్లు తెలిసిది. ఐపీఎల్ మ్యాచ్ లు తిరిగి ప్రారంభమయిన తర్వాత తొలి మ్యాచ్ ఈ నెల 17న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగనుంది. ఆగిపోయిన పదిహేడు మ్యాచ్ లు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబయిలలో మ్యాచ్ లు జరపాలని బీసీసీఐ నిర్ణయించింది.