తొలి వన్డేలో బంగ్లా దే విజయం

భారత్ - బంగ్లాదేశ్ తొలి వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.

Update: 2022-12-04 13:44 GMT

భారత్ - బంగ్లాదేశ్ తొలి వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇండియన్ బ్యాటర్లు విఫలమయినా బౌలర్లు రాణించడంతో తొలి వన్డేలో భారత్ గెలిచినట్లు కనిపించినా చివరకు ఓటమి పాలయింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. 41.2 ఓవర్లకే ఆల్ ఆవుట్ అయి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ఒక్కడే అత్యధికంగా పరుగులు చేశాడు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని అవుటయ్యాడు.

బంగ్లాదేశ్ బ్యాటర్లు...
అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ కూడా ఆదిలో నిలకడగానే ఆడుతున్నట్లు కనిపించినా తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. కులదీప్ సేన రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. శార్దూల్ ఠాకూర్, సిరాజ్ లు కూడా వికెట్లు తీసుకున్నారు. సిరాజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. 9 వికెట్లు కోల్పోయినా మెహదీ సిక్స్ లు, ఫోర్లతో బంగ్లాదేశ్ ను విజయం వైపు నడిపించాడు. దీపక్ చాహర్ నోబాల్స్ వేసి భారత్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాడు.  అందివచ్చిన క్యాచ్ లను చేజార్చుకోవడంతో ఇండియా ఓటమి పాలయింది.


Tags:    

Similar News