ఫోన్ చేసే దమ్ముందా: బాబర్ ఆజమ్

ఐసీసీ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్స్ చేరడం దాదాపు కష్టమే

Update: 2023-11-11 02:19 GMT

ఐసీసీ ప్రపంచ కప్ లో పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్స్ చేరడం దాదాపు కష్టమే!! దీంతో పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు ఆ జట్టు సమీకరణాలపై టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూలలో తెగ ట్రోల్ చేసేస్తూ ఉన్నారు. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పందించాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న బాబర్.. టీవీల్లో అభిప్రాయాలు చెప్పడం చాలా సులభం. ఎవరైనా సలహా ఇవ్వాలనుకుంటే, నాకు నేరుగా కాల్ చేయండి. అలాంటి వారు ఎంతమంది ఉన్నా స్వాగతిస్తా. నా నంబర్ కూడా అందరికీ తెలుసని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. గత మూడేళ్లుగా పాక్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నానని.. గతంలో ఎప్పుడూ ఇలాంటి విమర్శలు ఎదుర్కోలేదన్నాడు బాబర్. అందరూ నేను ఒత్తిడిలో ఉన్నానని అంటున్నారు.. నా వరకు అలా అనిపించడం లేదని తెలిపాడు బాబర్. ఫీల్డింగ్ సమయంలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని.. బ్యాటింగ్ సమయంలో ఎక్కువ పరుగులు చేసి జట్టును ఎలా గెలిపించాలి అని ఆలోచిస్తానని తెలిపాడు బాబర్.

ఈ టోర్నీలో బాబర్ ఆజాం 8 మ్యాచ్ ల్లో 282 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నవంబర్‌ 11న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడించాలి, లేదంటే ఇంగ్లాండ్ నిర్ధేశించే లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో ఛేదించాలి. అలా చేస్తేనే పాక్ జట్టు నెట్ రన్ రేట్.. న్యూజిలాండ్ కంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఆ జట్టు సెమీస్ కు అర్హత సాధిస్తుంది.


Tags:    

Similar News