Inda Vs Australia Chmapions Trophy : ఆస్ట్రేలియా ను నిలువరించడం ఎలా?

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసిస్ బ్యాటర్లు బంతితో ఆడుకున్నారు

Update: 2025-03-04 12:02 GMT

భారత్ - ఆస్ట్రేలియాల మధ్య దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసిస్ బ్యాటర్లు బంతితో ఆడుకున్నారు. స్లో పిచ్ మీద మంచి పరుగులే సాధించేటట్లు కనపడుతుంది. రన్ రేట్ 5.33 గా ఉండటంతో వన్డేలోనూ, అది దుబాయ్ లోనూ అది మంచి స్కోరుగానే భావించాలంటున్నారు క్రీడా నిపుణులు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే హెడ్ ను త్వరగా అవుట్ చేయడంతో ఒకింత భారత్ అభిమానుల్లో ఊరట దక్కినా స్మిత్ మాత్రం నిలకడగా ఆడి 73 పరుగులు చేయగలిగాడు. క్యారీ హాఫ్ సెంచరీకి దగ్గరయ్యారు. అంటే ముగ్గురు ఆసిస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఒకింత ఉతికి ఆరేశారనే చెప్పాలి.

భారీ స్కోరు దిశగా...
ప్రస్తుతం ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. క్యారీ క్రీజులో ఉండటంతో స్కోరు ఇంకా పెరిగే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. అదే సమయంలో 250 పరుగులకు లోపు ఆసిస్ ఆటగాళ్లను అవుట్ చేయగలిగితేనే భారత్ కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలు వినపడుతున్నాయి. షమి, జడేజా తలో రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒకటి, వరుణ్ చక్రవర్తి మరొక వికెట్ తీశారు. బౌలర్లు ఎంత శ్రమించినా వారు పాతుకుపోయిఆడుతుండటంతో స్కోరు భారీగాపెరిగే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇక మన బ్యాటర్ల మీద మరింత వత్తిడి పెరుగుతుందని చెప్పాలి. ఛేదనలో భారత్ కు మంచి సక్సెస్ రేటు ఉన్నప్పటికీ ప్రత్యర్థి ఆసిస్ కావడంతో ఒకింత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.
సీనియర్ ఆటగాళ్లు...
ఇక సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిపైనే ఎక్కువ భారం ఉంది. టార్గెట్ ను రీచ్ అవ్వాలంటే ఓపెనర్లుగా దిగిన శుభమన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లగలిగితేనే తర్వాత వచ్చే వారిపై వత్తిడి ఉండదు. స్పిన్నర్ల ప్రభావం ఈ పిచ్ పై పనిచేయలేదని అనుకోవాలా? లేక పేసర్లు ఎక్కువ వికెట్లు తీశారు అనుకోవాలా? అనే దానిపై పిచ్ మరికొంత సమయానికి మారే అవకాశాలున్నాయంటున్నారు. అందుకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లు రాణిస్తేనే విజయం మనవైపు తొంగి చూస్తుంది. ఆస్ట్రేలియా బలం బ్యాటింగ్ మాత్రమే కావడం భారత్ కు కొంత అదనపు బలంగా భావించినా దుబాయ్ పిచ్ లో మనోళ్లు ఏం చేస్తారన్నది మాత్రం ఫ్యాన్స్ నుకంగారు పెడుతుంది


Tags:    

Similar News