Asia Cup : దేశంలో వ్యతిరేకత.. మైదానంలో వత్తిడి.. ఎలా అధిగమిస్తారో?

ఆసియాకప్ లో భారత్ - పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. బాయ్ కాట్ నినాదం మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది.

Update: 2025-09-14 12:57 GMT

ఆసియాకప్ లో భారత్ - పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ మరికాసేపట్లో జరగనుంది. బాయ్ కాట్ నినాదం మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. పహాల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడవద్దంటూ ఎక్కువ మంది భారత క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ టిక్కెట్లు కొనవద్దని, టీవీల్లో చూడవద్దంటూ పెద్దయెత్తున పిలుపు నిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ లో వ్యతిరేకత.. మైదానంలో వత్తిడి మధ్య భారత్ - పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ వత్తిడి నుంచి తట్టుకుని భారత్ ఆటగాళ్లు బయటపడి మైదానంలో చెలరేగిపోవాలని కొందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఎటు చూసినా పాక్ పై టీం ఇండియాదే ఆధిపత్యం కనిపిస్తుంది.

బలంగా టీం ఇండియా...
పాకిస్తాన్ ఆటగాళ్లలో స్పిన్నర్లు ఉన్నప్పటికీ సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడం భారత్ కు కలసి వచ్చే అంశంగా చెప్పాలి. పాకిస్తాన్ స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొని తడబడకుండా నిలబడగలిగితే భారత్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. భారత్ ఎనిమిది వికెట్ల వరకూ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేష్ శర్మ వరకూ అందరూ బ్యాటర్లు హిట్టర్లు. జితేశ్ శర్మ కు బదులు సంజూ శాంసన్ దిగినా బ్యాటింగ్ లో దూసుకుపోతాం. ఇక స్పిన్నర్లలో వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ లు తమ చేతికి పని చెబుతారు. అలాగే హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బూమ్రా కూడా వికెట్లు తీయడంలో దిట్ట.
పాక్ కు ఇదే అడ్వాంటేజీ....
అయితే బ్యాటింగ్ పరంగా చూస్తే పాకిస్తాన్ బలహీనంగా ఉంది. నలుగురు స్పిన్నర్లు దాని బలం. దేశంలో ఈ మ్యాచ్ పట్ల ఉన్న వ్యతిరేకతను తట్టుకుని వత్తిడికి ఎదురొడ్డి నిలబడగలిగితే భారత్ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రీడానిపుణులు చెబుతున్నారు. 2022 లో టీ20 ఫార్మాట్ లో మొదలయిన ఆసియా కప్ రెండు సార్లు మాత్రమే జరిగింది. ఈ ఫార్మాట్ లో మూడు సార్లు భారత్, పాకిస్తాన్ లు తలపడ్డాయి. రెండు మ్యాచ్ లలో టీం ఇండియా విజయం సాధించగా, ఒక మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో నిన్నటి వరకూ వన్ సైడ్ గా జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లు ఈరోజు మాత్రం నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనున్నాయని చెప్పాలి.
















Tags:    

Similar News