Champions Trophy : నేడు మరో కీలక మ్యాచ్

ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది

Update: 2025-03-05 04:23 GMT

ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. సౌతాఫ్రికా - న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ లోని గడాఫీ స్టేడియంలో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే నిన్న జరిగిన సెమీ ఫైనల్స్ లో భారత్ ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకున్న నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ పై అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

న్యూజిలాండ్ బలంగా...
అయితే రెండు జట్లలో న్యూజిలాండ్ జట్టు కొంత బలంగా కనిపిస్తుంది. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా న్యూజిలాండ్ రాణిస్తుండటంతో దానికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. కానీ క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు. ఆరోజు మైదానంలో ఎవరిది పై చేయి అయితే వారిదే విజయం అవుతుంది కాబట్టి ఫైనల్ కు ఎవరు చేరతారన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేం.


Tags:    

Similar News