IPL 2025 : ఐపీఎల్ లో నేడు గుజరాత్ vs హైదరాబాద్

ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది.

Update: 2025-05-02 02:48 GMT

ఐపీఎల్ మ్యాచ్ లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెలతోనే ముగియనున్నాయి. ఇప్పటికే యాభైకి పైగానే మ్యాచ్ లు జరిగాయి. మరో ఇరవై ఐదు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్ లలో గెలిచినా కొన్ని ప్లే ఆఫ్ రేసుకు చేరుకునే అవకాశం లేదు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. మిగిలిన ఎనిమిది జట్లు తొలి నాలుగు స్థానాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో పాటు గెలుపు కూడా అవసరమవుతుంది.

నేడు మరో కీలక మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడి ఆరు మ్యాచ్ లలో గెలిచి మూడు మ్యాచ్ లలో ఓటమి పాలయి పన్నెండు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా తొమ్మిది మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచి ఆరు మ్యాచ్ లలో ఓటమి పాలయి కేవలం ఆరు పాయింట్లతో ఉంది. అందుకే ఈ మ్యాచ్ లో గెలుపు ఇరుజట్లకు అవసరమే.


Tags:    

Similar News