IPL 2025 : నేడు డూ ఆర్ డై మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ తో నేడు ఢీ కొట్టనుంది.
ఐపీఎల్ లో ఏ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకుంటాయన్నది ఒక క్లారిటీ దాదాపుగా వచ్చింది. ఇప్పటికే ఢిల్లీ కాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మంచి పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో నిలిచాయి. మరో రెండు టీంలపైన ఈ జట్లు గెలిస్తే గ్యారంటీగా ప్లే ఆఫ్ కు చేరుకున్నట్లే. తర్వాత స్థానంలో ముంబయి ఇండియన్స్ వచ్చి చేరింది. నాలుగో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. అయితే ఇంకా ప్లే ఆఫ్ కు చేరుకునేందుకు సమయం ఉండటంతో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నాలుగు స్థానాల కోసం ఈ జట్లు పోటీ పడుతున్నాయి.
బెంగళూరు వర్సెస్ రాజస్థాన్...
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రాజస్థాన్ రాయల్స్ తో నేడు ఢీ కొట్టనుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆరంభంలో అదరగొట్టినా తర్వాత ఓటములను చవి చూస్తుంది. అయినా అది పాయింట్ల పట్టికలో బాగానే పెర్ ఫార్మెన్స్ చూపుతుంది. అయితే సొంత వేదిక బెంగళూరు ఈ జట్టుకు అచ్చి రావడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడి కేవలం మూడు మ్యాచ్ లలోనే ఓడింది. ఐదు మ్యాచ్ లలో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఎనిమిది మ్యాచ్ లు ఇప్పటి వరకూ ఆడితే అందులో రెండింటిలో మాత్రమే గెలిచింది. ఆరింటిలో ఓటమి పాలయింది. దీంతో ఈ మ్యాచ్ లో బెంగళూరుకు విజయం ఎంత అవసరమో.. రాయల్స్ కూడా అంతే అవసరం.