IPL 2025 : నేడు ఉత్కంఠ పోరుకు ఇరుజట్లు సిద్ధం
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది.
ఐపీఎల్ లో అన్ని మ్యాచ్ లు ఉత్కంఠగా సాగుతున్నాయి. అంచనాలు లేని జట్లు ఒక్కసారిగా ఊపందుకుంటున్నాయి. అలాగే ఛాంపియన్స్ గా నిలిచిన జట్లు చతికలపడుతున్నాయి. ఊహించన జట్లు మాత్రం ఈసారి ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు వస్తాయా? రావా? అన్న అనుమానం కూడా అందరికీ కలుగుతుంది. ఎందుకంటే ఈసారి ఐపీఎల్ లో అనుకోని అనూహ్యమైన విజయాలు, అపజయాలను క్రికెట్ ఫ్యాన్స్ ను చూస్తున్నారు. ఇందుకు కారణాలు తెలియకపోయినా క్రికెట్ లో ఏదైనా జరగొచ్చు అనడానికి ఈ ఐపీఎల్ నిదర్శనమని చెప్పకతప్పదు.
నేడు మరో కీలక మ్యాచ్...
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ కాపిటల్స్ ఈ సీజన్ లో టాప్ పొజిషన్ లో ఉంది. ఐదు మ్యాచ్ లు ఆడి నాలుగు మ్యాచ్ లు గెలిచి ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రం ఆరు మ్యాచ్ లు ఆడి రెండింటిలో గెలతిచి నాలుగు మ్యాచ్ లో ఓడి పాయింట్ల పట్టికలో దిగువన ఉంది. ఈ మ్యాచ్ లో ఏదైనా జరిగే అవకాశముంది.