IPL 2025 : నేడు ఐపీఎల్ లో పంజాబ్ vs ఢిల్లీ

నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ కాపిటల్స్ ఢీ కొంటుంది.

Update: 2025-05-08 03:11 GMT

ఐపీఎల్ సీజన్ 18 లో మ్యాచ్ లు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ కు ఏ జట్లు చేరుకుంటాయన్నది ఒక అంచనాకు వచ్చింది. అయితే ఇక ముందు జరిగే ప్రతి మ్యాచ్ కూడా అన్ని జట్లకు కీలకమే. ఇప్పటికే కొన్ని జట్లు హైదరాబాద్ సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. మిగిలిన జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉన్నప్పటికీ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశం లేదు. అందుకే ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగానే జరుగుతుంది.

నేడు డూ ఆర్ డై మ్యాచ్...
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ తో ఢిల్లీ కాపిటల్స్ ఢీ కొంటుంది. ధర్మశాలలో రాత్రి ఏడున్నరగంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పంజాబ్ పదకొండు మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లు గెలిచి మూడు మ్యాచ్ లు ఓడి ఒక మ్యాచ్ వర్షం కారణంతో రద్దు కావడంతో పదకొండు పాయింట్లతో సరిపెట్టుకుంది. ఢిల్లీ కాపిటల్స్ ఆరంభంలో అదరగొట్టినప్పటికీ తర్వాత వరస ఓటములతో డీలా పడింది. ఢిల్లీ కాపిటల్స్ జట్టు పదకొండు మ్యాచ్ లు ఆడి ఆరింటిలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓడి ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయి ప్లే ఆఫ్ లో స్థానం కోసం పోటీ పడుతుంది. సో.. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే.


Tags:    

Similar News