Asia Cup : నేడు టీం ఇండియా vs బంగ్లాదేశ్
ఆసియా కప్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ దుబాయ్ లో రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది
ఆసియా కప్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ - బంగ్లాదేశ్ ల మధ్య జరగనున్న మ్యాచ్ దుబాయ్ లో రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ ఇప్పటికే శ్రీలంక జట్టుపై విజయం సాధించి ఉత్సాహంతో ఉంది. అయితే భారత్ స్వల్ప మార్పులతో బంగ్లాదేశ్ తో తలపడే అవకాశముంది. బంగ్లాదేశ్ ను ఓడించి నేరుగా ఫైనల్స్ కు చేరుకునేందుకు టీం ఇండియా మార్గం సుగమం చేసుకునే వీలుండటంతో టీం ఇండియా ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. బంగ్లాదేశ్ జట్టు కూడా బలంగా కనిపిస్తుంది.
స్వల్ప మార్పులతో భారత్...
గతంలోనూ బంగ్లాదేశ్ ఆసియా కప్ లో మూడుసార్లు ఫైనల్స్ లో తలపడని తీరు కొంత కలవరపరుస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశముందని తెలిసింది. భారత్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా కు విశ్రాంతి నిచ్చే అవకాశముంది. బుమ్రా స్థానంలో అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని అంటున్నారు. బుమ్రా ఇక వరసగా రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండటంతో ఈ మ్యాచ్ లో విశ్రాంతి ఇవ్వాలని భారత్ జట్టు భావిస్తుంది. అలాగే వరుణ్ చక్రవర్తికి కూడా పక్కన పెట్టాలని భావిస్తుంది. అయితే మార్పులు జరుగుతాయా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.