IPL 2025 : నేడు ఐపీఎల్ లో డూ ఆర్ డై మ్యాచ్
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ నేడు పడనుంది
ఐపీఎల్ లో కీలక మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్ కు చేరుకోవడానికి నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అన్నింటికంటే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో గుజరాత్ టైటాన్స్, మూడో స్థానంలో ముంబయి ఇండియన్స్ జట్టు, నాలుగో స్థానంలో ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఉంది. అయితే ఇంకా మ్యాచ్ లు మిగిలి ఉండటంతో ఏ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అందుకే ఇకపై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠతో కూడినదేనని చెప్పాలి.
నేడు కీలక మ్యాచ్...
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ టైటాన్స్ నేడు పడనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జైపూర్ లో జరగనుంది. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఎనిమిది మ్యాచ్ లు ఆడి ఆరింటిలో గెలిచి పన్నెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ సీజన్ లో పెద్దగా పెర్ ఫార్మెన్స్ చూపలేకపోతుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకూ తొమ్మిది మ్యాచ్ లు ఆడి రెండింటిలో గెలిచి ఏడు పాయింట్లతో అట్టడుగులో ఉంది. మరి ఈ రోజు మ్యాచ్ లో ఏం జరగనుందన్నది చూడాల్సి ఉంది.