IPL 2025 : నేడు డూ ఆర్ డై మ్యాచ్
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది
ఐపీఎల్ లో కొన్ని జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ ఆశలు ముగించుకుని ఇబ్బంది పడుతున్నాయి. ప్రధానంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఈసారి ప్లే ఆఫ్ కు రావడం కష్టమేనని అనిపిస్తుంది. వరస ఓటములు జట్లను కుంగదీస్తుంది. పాయింట్ల పట్టికలో చివరిలో ఉండటంంతో పాటు ఇప్పటికే సగం పైగా మ్యాచ్ లు పూర్తి కావడంతో ఇక ఈ జట్లు ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ప్లే ఆఫ్ కు చేరే నాలుగు స్థానాల కోసం మిగిలిన జట్లు పోటీ పడుతున్నాయి.
నేడు మరో ముఖ్యమైన మ్యాచ్...
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ జట్టుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. కోల్ కత్తా లో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకూ గుజరాత్ టైటాన్స్ ఏడు మ్యాచ్ లు ఆడి ఐదింటిలో గెలిచి రెండింటిలో ఓడి పది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ కూడా ఏడు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లు గెలిచి నాలుగింటిలో ఓడి కేవలం ఆరు పాయింట్లతోనే ఉంది. దీంతో కోల్ కత్తాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పాలి.