IPL 2025 : నేడు ముంబయి vs హైదరాబాద్ ఢీ
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది
ఐపీఎల్ 18వ సీజన్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇప్పటి వరకూ అన్ని మ్యాచ్ లు ఉత్కంఠగానే సాగాయి. కొన్ని మ్యాచ్ లు తక్కువ స్కోరు చేసినప్పటికీ గెలుప ముంగిట బోల్తాపడిన ఘటనలు ఈ ఐపీఎల్ సీజన్ లోనే చూశాం. అదే సమయంలో భారీ స్కోరును అలవోకగా ఛేదించిన జట్లు కూడా ఈ సీజన్ లో కనిపించాయి. అందుకే ఐపీఎల్ పద్దెనిమిది సీజన్ల నుంచి నడుస్తున్నా ఏ మాత్రం బోర్ కొట్టకుండా మ్యాచ్ లన్నీ రంజింప చేస్తున్నాయి. కొన్ని జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి.
నేడు మరో ముఖ్యమైన మ్యాచ్...
ఈరోజు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడుతుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ ఆరంభంలో తడబడి ఓటములు చవిచూసినా తర్వాత తేరుకుని విజయాల బాట పట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఇంకా తేరుకోలేదు. అపజయాలను సొంతం చేసుకుంటుంది. ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ ఎనిమిది మ్యాచ్ లు ఆడి నాలుగింటిలో గెలిచి నాలుగు మ్యాచ్ లలో ఓడింది.సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లలోనే గెలిచి ఐదు మ్యాచ్ లలో ఓడింది. ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనుంది.