Akash Deep : ఈ కష్టాలు పగోడికి కూడా రాకూడదయ్యా.. ఆకాశమంత ఓర్పు నీదయా
ఇండియా - ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియాను గెలిపించిన ఆకాశ్ దీప్ అంటే ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టవచ్చేమో కాని ఆయన కష్టాలు చూసిన వాళ్లకు కన్నీళ్లు ఆగవు.
ఇండియా - ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియాను గెలిపించిన ఆకాశ్ దీప్ అంటే ఇప్పుడు అందరూ చప్పట్లు కొట్టవచ్చేమో కాని ఆయన కష్టాలు చూసిన వాళ్లకు కన్నీళ్లు ఆగవు. మిడిల్ క్లాస్ లో పుట్టి టీం ఇండియాలో చోటు దక్కించుకోవడం పెద్ద విషయం. అదే సమయంలో దేవుడు అతని పక్షాన లేడు. క్రికెట్ లో కుదురుకుందామనుకుంటే ఎప్పుడూ ఏదో కష్టాన్ని కుటుంబంలో తెచ్చి పెట్టి వెనక్కు లాగే ప్రయత్నం చేశాడు. అయినా మొక్కవోని దీక్షతో ఆకాశ్ దీప్ తన కష్టాలను దిగమింగుకుని బంతిపైనే ఫోకస్ పెట్టాడు. ఆకాశ్ దీప్ ది బీహార్. బీహార్ అంటే వెనకబడిన రాష్ట్రం. అందులోనూ మిడిల్ క్లాస్ కు చెందిన ఆకాశ్ దీప్ ను క్రికెట్ ఆడతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. కానీ క్రికెట్ పై ఉన్న ప్రేమ కష్టాలను కనిపించనివ్వలేదు.
టీం ఇండియాలోచోటు కోసం...
ఎప్పటికైనా టీం ఇండియాలో చోటు సంపాదించాలన్న లక్ష్యం ముందు కష్టాలు చిన్న బోయాయి. తండ్రి ఒక ఉపాధ్యాయుడు. జీవితంలో స్థిరపడాలనుకుంటే చదువుకకోవాలి కాని ఇలా బంతులు, వికెట్లు పట్టుకుని తిరగడమేట్రా అని మందలింపులే ఎక్కవగా తండ్రి నుంచి వినిపించేవి. అయినా తన తండ్రి మనసు నొప్పించకుండా క్రికెట్ పై మక్కువతో నిరంతరం ప్రాక్టీస్ చేసేవాు.కానీ పద్దెనిమిదేళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. ఈ దెబ్బ నుంచి కోలుకోవడం ఎవరికైనా కష్టమే. తర్వాత తన సోదరుడు మరణించాడు. ఇలా కుటుంబంలో వరస మరణాలు చూసి షాక్ కు గురయిన ఆకాశ్ దీప్ కుటుంబాన్ని అందరిలాగే ఆర్థిక కష్టాలు పలకరించాయి. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. అయితే తన సోదరి అఖండ్ జ్యోతి తనకు అండగా నిలిచిందంటాడు ఆకాశ్ దీప్.
సోదరి అండతో...
నీకు ఇష్టమైన క్రికెట్ ను వదులుకోవద్దు. అప్పటి వరకూ ఢిల్లీ క్రికెట్ క్లబ్ లో ఆడినా అక్కడి నుంచి కోల్ కత్తాకు వెళ్లాడు. అక్కడ కుదురుకోవాలని ప్రయత్నించాడు. 2017లో బెంగాల్ లోని దుర్గాపూర్ కు వెళ్లి అక్కడ టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడి తర్వాత కోల్ కత్తా కు వచ్చాడు. తర్వాత మాజీ టీం ఇండియా ఆటగాడు అరున్ లాల్ ఆకాశ్ దీప్ లోని పట్టుదలను చూసి మెచ్చుకున్నాడు. అండగా నిలిచాడు. ఇక మహ్మద్ షమి, రణదేబ్ బోస్ లు కూడా సహకరించారు. తర్వాత బెంగాల్ అండర్ 23 ఆడాడు. ఆకాశ్ దీప్ ఫిట్ గా మారడంతో 2019లో బెంగాల్ సీనియర్ జట్టులో అరంగ్రేట్రం చేసిన ఆకాశ్ ఇక వెనుదిరగలేదు. బౌలింగ్ త అందరినీ ఆకట్టుకున్నారు. 2021లో రాయల్ చాలెంజర్స్ కు నెట్ బౌలర్ గా వ్యవహరించాడు.కోహ్లి ని మనసు ఆకట్టుకోవాలన్నది అతని ప్రయత్నం.
ఇరవై నుంచి ఐదు కోట్ల వరకూ...
2020లో ఐపీఎల్ లో 20 లక్షల కనీస ధరకు బెంగళూరు జట్టులో ప్రవేశించాడు. తాను అభిమానించే కోహ్లి నుంచి క్యాప్ అందుకుంటుంటే ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆగలేదు. ఇక తర్వాత ఐపీఎల్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఆకాశ్ దీప్ ను ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి సొంతం చేసుకుంది. తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్ జట్టుకు ఎంపికై టీం ఇండియా గెలుపునకు ప్రధాన కారణంగా మారారు. పది వికెట్లు తీసి గెలుపునకు కారణమయ్యాడు. ఎన్ని కష్టాలు.. అయినా సరే క్రికెట్ ముందు కష్టాలు చిన్నబోయాయి. తన సోదరి జ్యోతికి క్యాన్సర్ అని తెలిసి తల్లడిల్లిపోయాడు. అయితే తన ఆటను చూసి అక్క కళ్లలో ఆనందం చూశాను అంతే చాలు అంటున్నాడు ఆకాశ్ దీప్. ఈ కష్టాలు పగవాడికి కూడా రాకూడదయ్యా? అనేంత రేంజ్ లో వచ్చినా ఆకాశమంత ఓపిక, పట్టుదలతో ముందుకు వెళ్లి కెరీర్ ను ఆకాశ్ దీప్ మలుచుకోగలిగాడు.