వేలంలో 350 మంది కామెరూన్‌ గ్రీన్‌ కోసం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది.

Update: 2025-12-10 16:04 GMT

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2026 సీజన్‌ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరగనుంది. 77 స్థానాల కోసం మొత్తం 350 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 240 మంది భారత క్రికెటర్లు కాగా 110 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 10 ఫ్రాంఛైజీలు కలిసి గరిష్టంగా 77 మందిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ చివరి నిమిషంలో వేలంలోకి వచ్చాడు. మొదట 1390 మంది ప్లేయర్లు వేలంలో తమ పేర్లు నమోదు చేసుకోగా... అందులో ఫ్రాంచైజీల ఆసక్తి మేరకు 350 మందిని షార్ట్‌ లిస్ట్‌ చేశారు. ఒక్కో సెట్‌లో పది మంది చొప్పున 35 సెట్‌ల పాటు వేలం సాగనుంది. టీమిండియా ప్లేయర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్‌ ఖాన్‌ ప్రాథమిక ధరను 75 లక్షలుగా నిర్ణయించుకున్నారు. వెంకటేశ్‌ అయ్యర్‌ను ప్రాథమిక ధర 2 కోట్లతో వేలానికి రానున్నాడు. పది ఫ్రాంచైజీల్లో అత్యధికంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దగ్గర 64.3 కోట్లు అందుబాటులో ఉండగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ 43.4 కోట్లతో రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 25.5 కోట్లతో మూడో స్థానంలో ఉంది.

Tags:    

Similar News