Visakha : నేడు విశాఖలో భారత్ - దక్షిణాఫ్రికా మూడో వన్డే
నేడు విశాఖపట్నంలో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది
నేడు విశాఖపట్నంలో భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. మూడు వన్డే సిరీస్ లో భాగంగా ఇప్పటికే భారత్, దక్షిణాఫ్రికా 1-1సిరీస్ తో సమానంగా నిలిచాయి. దీంతో ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికేఈ మ్యాచ్ కోసం విశాఖలో ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
ఈ మ్యాచ్ కీలకం...
ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంటుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా ఈ సిరీస్ ను చేజిక్కించుకోవాలన్న కసితో ఉంది. టెస్ట్ సిరీస్ ను సొంత గడ్డపై కోల్పోయినభారత్ ఈ సిరీస్ లోనైనా గెలిచి సత్తా చూపుదామని భావిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ కీలకం కానుంది. అందుకే ఈ మ్యాచ్ పట్ల అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.