India vs Australia : మెల్ బోర్న్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి?

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది.

Update: 2025-10-31 02:16 GMT

భారత్ - ఆస్ట్రేలియా మధ్య నేడు రెండో టీ 20 మ్యాచ్ జరగనుంది. మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు కూడా వాన గండం పొంచి ఉన్నట్లు కనిపిస్తుంది. కాన్ బెర్రాలో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆస్ట్రేలియాతో మొత్తం ఐదు టీ20 మ్యాచ్ లు సిరీస్ లు ఆడాల్సి ఉండగా నేడు మెల్ బోర్న్ వాతావరణం కూడా అంత అనుకూలంగా కనిపించడం లేదు. వన్డే సిరీస్ ను కోల్పోయిన భారత్ జట్టు టీ20 సిరీస్ ను గెలవాలని తహతహలాడుతుంది. దీనికి వరుణుడు అడ్డుకట్ట వేస్తున్నట్లుంది.

వాతావరణ శాఖ సూచనలతో...
రెండో మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ లో ఆధిపత్యం సంపాదించాలని భారత్, ఆస్ట్రేలియా ప్రయత్నిస్తున్నాయి. అయితే మెల్ బోర్న్ లో వాతావరణం అనుకూలించకపోవచ్చు. 87 శాతం వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ మ్యాచ్ పై కూడా అనుమానాలు అలుముకున్నాయి. మెల్ బోర్న్ మైదానం బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయం ఇక్కడ తక్కువ సార్లు దక్కడంతో టాస్ గెలిస్తే తొలుత ఏ జట్టయినా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది. మరి వర్షం ఈ మ్యాచ్ ను కొనసాగిస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News