India vs South Africa : నేడు భారత్ - దక్షిణాఫ్రికా తొలి టీ20
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేటి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కటక్ వేదికగా జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత్ సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయి వన్డే సిరీస్ ను గెలుచుకుంది. ఇప్పుడు టీ 20 సిరీస్ పై కన్నేసింది. అయితే ఐదు మ్యాచ్ లున్న టీ20 సిరీస్ పై భారత్ కన్నేసింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా కూడా టీ20 సిరీస్ లో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది.
ఇరు జట్లు బలంగానే...
ఆసియా కప్ లో అన్ని మ్యాచ్ లో గెలిచి భారత్ రెట్టించిన ఉత్సాహంతో మైదానంలో ఉండగా దక్షిణాఫ్రికా కూడా భారత్ ను మట్టి కరిపించి తమ పవర్ చూపించాలనుకుంటుంది. హార్థిక పాండ్యా రీ ఎంట్రీతో భారత్ బౌలింగ్, బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారింది. టాస్ గెలిచిన జట్టు మాత్రం కటక్ లో తొలుత ఫీల్డింగ్ ను మాత్రమే ఎంచుకుంటుంది. ఛేజింగ్ కోసమే ఇరు జట్లు ప్రయత్నిస్తాయి. మరి ఈ మ్యాచ్ ఎవరి పరం అవుతుందన్ని చూడాలి.