India Vs Australia T20 : గోల్డ్ కోస్ట్ టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే? పిచ్ రిపోర్టు ఇదే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. గోల్డ్ కోస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారత్ - ఆస్ట్రేలియాల మధ్య టీ20 సిరీస్ లో 1 -1 సమంగా ఉంది. కాన్ బెర్రాలో తొలి టీ 20 వర్షంతో నిలిచిపోయింది. రెండో టీ 20లో ఆస్ట్రేలియా నెగ్గింది. మూడో టీ 20లో భారత్ జట్టు తన సత్తాను చూపింది. ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇరుజట్లు ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ పై పట్టునిలుపుకోవాలని భావిస్తున్నాయి. మరొక మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ నేడు జరిగే టీ 10 మ్యాచ్ కీలకం అని చెప్పాలి.
ఇరు జట్లు గెలిచేందుకు...
రెండు జట్లు ఈ మ్యాచ్ ను గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతాయి. రెండు బలమైన జట్లు. ఆస్ట్రేలియాకు సొంత గడ్డ కావడంతో అదనపు బలం అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ కు ఓపెనర్ హెడ్ దూరమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా కొంత బ్యాటింగ్ పరంగా ఇబ్బందులు పడక తప్పదంటున్నారు. భారత్ కూడా బౌలింగ్ పరంగా కొంత ఇబ్బందులు పడుతుంది. హార్థిక్ పాండ్యా ఈ సిరీస్ కు అందుబాటులో లేకపోవడం స్పష్టంగా మ్యాచ్ పై కనిపిస్తుంది. అయితే భారత్ బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తుంది.
బ్యాటర్లకు అనుకూలం...
గోల్డ్ కోస్ట్ మైదానంలో వాతావరణ శాఖ మాత్రం ఎలాంటి వర్షం పడే సూచనలు లేవని చెప్పడంతో మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. పదిహేడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. అందులోనూ గోల్డ్ కోస్ట్ గ్రౌండ్ బ్యాటర్లకు స్వర్గ ధామం. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పిచ్ కావడంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ మాత్రం మూడో మ్యాచ్ తరహాలోనే జట్టు కూర్పు ఉండే అవకాశముంది.
భారత్ తుది జట్లు అంచనా
భారత్: శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, శివమ్ దూబే లేకుంటే నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(కీపర్), అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా