India - South Africa : వన్డే సిరీస్ ను కొట్టేశారు.. ఇక టీ20 సిరీస్ మిగిలింది.. కట్ పిచ్ రిపోర్టు ఇలా
ఇండియా - దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు కటక్ లో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది.
ఇండియా - దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు కటక్ లో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. టెస్ట్ సిరీస్ లో దక్షిణాఫ్రికాపై భారత్ వైట్ వాష్ కాగా, వన్డే సిరీస్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. రాంచీలో గెలిచింది. రాయపూర్ వన్డే లో ఓటమి పాలయిన టీం ఇండియా విశాఖలో దుమ్ము రేపింది. దీంతో వన్డే సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. ఇక మిగిలింది టీ20 సిరీస్. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఈ నెల 9వ తేదీ నుంచి భారత్ లో ప్రారంభం కానుంది. కటక్ వేదికగా తొలి మ్యాచ్ ఈ నెల 9వ తేదీన జరగనుంది.
టీం ఇండియా సూపర్ పెర్ ఫార్మెన్స్...
అయితే టీం ఇండియా టీ20 లలో మంచి పెర్ ఫార్మెన్స్ చూపుతుంది. ఆసియాకప్ లోనూ అదరగొట్టింది. ఒక్క మ్యాచ్ కూడా ఓటమి పాలు కాకుండా అన్ని మ్యాచ్ లు గెలిచిన టీం ఇండియా టీ20లలో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. టెస్ట్, వన్డే మ్యాచ్ లకు భిన్నంగా ఈ జట్టు కూర్పు ఉంటుంది. ఇందులో అందరూ భారత్ యువఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఈ సిరీస్ పై టీం ఇండియా కన్నేసింది. దక్షిణాఫ్రికాను కూడా తక్కువగా చూడలేం. ఎందుకంటే ఆజట్టు కూడా టీ20 లలో మెరుగైన ప్రదర్శన చేస్తుంది.
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో...
తొలి టీ20 మ్యాచ్ ఈనెల9వ తేదీన కటక్ లోనూ, రెండో టీ20 డిసెంబరు 11న చండీగడ్ లోనూ, మూడో టీ20 డిసెంబరు 14న ధర్మశాలలోనూ జరగనున్నాయి. నాలుగో టీ 20 మ్యాచ్ డిసెంబరు 17వ తేదీన లక్నోలోనూ, ఐదో మ్యాచ్ అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయి. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా టీ20 మ్యాచ్ లలో ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా ఉంది. ఇరు జట్ల మధ్య మొత్తం 31 టీ20 మ్యాచ్ లు జరిగితే భారత్ పద్దెనిమిది, దక్షిణాఫ్రికా 12 మ్యాచ్ లలో మాత్రమే గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. దీంతో ఈ టీ20 సిరీస్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.