ఆ విషయంలో జ‌గ‌న్ వెనుకాడ‌టం లేదా!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సర సమయం మాత్రమే మిగిలి ఉంది. మరో 10 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ కేంద్ర ఎన్నికల సంఘం

Update: 2023-06-05 10:29 GMT

appolitics

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మరో సంవత్సర సమయం మాత్రమే మిగిలి ఉంది. మరో 10 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. అయితే అంతకుముందే ఎన్నికలు జరిగే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సంవత్సరం చివరిలోగా ఎన్నికలు జరగొచ్చని ఏపీలో మాట్లాడుకుంటున్నారు. ఒక వేళ అదే జరిగితే మరో 6 నెలల్లో ఎన్నికలు ఉండొచ్చు. ప్రీ పోల్స్‌ ఉన్నా లేకపోయినా.. ఎన్నికలకు గట్టిగా మరో 10 నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ తమ ఏర్పాట్లలో ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు గుర్రాలను నిలబెట్టడం ఆయా పార్టీలకు సవాలుతో కూడుకున్నది.

అధికార పార్టీతో పాటు ఇతర పార్టీలు తమ అభ్యర్థుల ఖరారు విషయంలో ఆలోచించుకోవాల్సిన సమయం ఇదే. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు. ఎందుకంటే అభ్యర్థులను ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దించాల్సిన అంశంపై పార్టీల అధి నాయకత్వాలు ఇప్పుడు తెల్చుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది. టికెట్‌ కేటాయింపు విషయంలో అటు సిట్టింగ్‌లను పక్కన పెట్టాలన్నా.. ఇటు అసంతృప్తులను చల్లార్చాలన్నా.. ఇదే కరెక్ట్ టైమ్. ప్రస్తుతం ఆయా రాజకీయ పార్టీలు అదే పనిలో ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టికెట్ల కేటాయింపు విషయంలో వైసీపీ ఇప్పటికే నిమగ్నమై ఉంది. ఈ సారి చాలా మంది సిట్టింగులను పక్కన పెడుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

150 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది సిట్టింగులకు ఈ సారి టికెట్‌ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. మార్పు చేర్పుల విషయంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ కుండబద్దలు కొట్టినట్టుగా వ్యవహరించడానికి వెనుకాడటం లేదట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారట. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ వారికి ద‌క్క‌ద‌నే విష‌యాన్ని ముందుగానే చెప్ప‌డానికి జ‌గ‌న్ వెనుకాడ‌టంల ఏద‌నే స్ప‌ష్ట‌తా వ‌చ్చింది. టికెట్‌ ఇవ్వని వారికి ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూపిస్తామని.. పార్టీ నిల‌బెట్టిన అభ్య‌ర్థి గెలుపుకోసం ప‌ని చేయాల‌నే సూచ‌న సీఎం జ‌గ‌న్ నుంచి అందిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. 

Tags:    

Similar News