ఆమె ఒరేయ్ అంటే.. మేము ఒసేయ్ అనలేమా : ఫుల్ గా ఫైర్ అయిన బొండా ఉమ

కేవలం రాజకీయ కక్షతోనే తమకు నోటీసులిచ్చారని అన్నారు. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు తాము స్పందించే..

Update: 2022-04-25 11:03 GMT

విజయవాడ : ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బొండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ పై వైసీపీ ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటోందని.. దారుణం జరిగిన మూడు రోజుల తర్వాత పరామర్శకు వాసిరెడ్డి పద్మ వచ్చారని విమర్శించారు. మొహానికి మేకప్ వేసుకొచ్చి ఆసుపత్రిలో అబద్ధాలు చెప్పారని అన్నారు. ఆమె ఒక బజారు మనిషిలా మాట్లాడుతున్నారని.. ఆమె ఒరేయ్ అంటే.. తాము ఒసేయ్ అనలేమా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ను వాసిరెడ్డి పద్మ రోడ్డున పడేశారని చెప్పారు. కేవలం రాజకీయ కక్షతోనే తమకు నోటీసులిచ్చారని అన్నారు. వ్యక్తిగత కక్షతో ఇచ్చిన నోటీసులకు తాము స్పందించే ప్రసక్తే లేదని చెప్పారు. ఆమెను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి నుంచి తొలగించేంత వరకు తాము న్యాయపోరాటం చేస్తామని అన్నారు.

తాము బాధితురాలిని కలవడానికి వెళ్తున్నామని తెలిసే.. వాసిరెడ్డి పద్మ అక్కడికి చేరుకుని ఓవరాక్షన్ చేశారని అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని రోడ్డుకు లాగిందే వాసిరెడ్డి పద్మ అని తీవ్ర విమర్శలు చేశారు. ఈనెల 27లోగా బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు తాము స్పందించిందే లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. ఈ అంశంపై తాము న్యాయ పోరాటానికి సిద్ధమని తెలిపారు. జగన్ సర్కారు బాధితురాలి శీలాన్ని రూ.10 లక్షలకు వెలకట్టి చేతులు దులుపుకుందని బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీనేత బొండా ఉమకు రాష్ట్ర మహిళా కమిషన్ శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించే క్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మను అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు, బొండా ఉమ వ్యక్తిగతంగా హాజరుకావాలని మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈనెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చంద్రబాబు, బొండా ఉమ స్వయంగా విచారణకు కావాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సమన్లలో ఆదేశించారు.


Tags:    

Similar News