విద్యార్థుల సభలో రాజకీయాలా?

ఏపీ సీఎం జగన్‌పై జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతిన మహేశ్ ఫైర్ అయ్యారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో ఓట్ల

Update: 2023-05-25 11:25 GMT

ఏపీ సీఎం జగన్‌పై జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పోతిన మహేశ్ ఫైర్ అయ్యారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో ఓట్ల రాజకీయం చేస్తూ విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద 5 వేల కోట్ల రూపాయాలు బకాయిలు ఉన్న మాట వాస్తవంకాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ పాలనలో పీజీ విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం లేకపోవడంతో ఐదు లక్షల మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన పథకాల ప్రకటనలో కోసం ఆయయ పత్రికకు వంద కోట్లు రూపాయాల ప్రజా ధనాన్ని భారతీరెడ్డికి దోచిపెట్టారని ఆరోపించారు.

ఏపీలో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు ఉద్యోగాల లేకపోవడంతో జీవితాలు స్థిరపడక అయోమయంలో ఉన్నారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అయితే బుధవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించిన సీఎం జగన్ విద్యా దీవెన కార్యక్రమం కింద జనవరి, మార్చి త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు రూ.703 కోట్లు విడుదల చేశారు. విద్యార్థుల తల్లుల అకౌంట్లలోకి బటన్ నొక్కి నేరుగా నగదు జమ చేశారు. అయితే ఇప్పటివరకు విద్యా దీవెన పథకం పెట్టిన ఖర్చు రూ.14,912 కోట్లు. సభలో ప్రసంగించిన సీఎం జగన్.. చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని ఫైర్ అయ్యారు.

ఫీజులు అరకొరగా ఇచ్చేవారు, ఎప్పుడు ఇచ్చేవారో తెలిసేది కాదు, ముష్టి వేసినట్లు ఇచ్చేవారని అన్నారు. సభ వేదికగా సీఎంజగన్ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మంచి జరుగుతుంటే తోడేళ్లంతా కలిసికట్టుగా ఏకం అవుతున్నారన్నారు. ఇక విద్యాదీవెన సభలో సీఎం జగన్ రాజకీయ ప్రసంగం చేశారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమంలో రాజకీయాలెందుకు? కొందరు మంత్రులేమో సింహాలు సింగిల్‌లగా వస్తాయని రెచ్చగొడతారు. ప్రతిపక్షాల ప్రభుత్వ పరిధిలోని వివిధ అంశాలపై విమర్శలు చేస్తుంటాయి.. వాటికి సమాధానం చెప్పడం అధికార పక్షం బాధ్యత అని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

Tags:    

Similar News