80 శాతం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కే

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పొత్తుల విషయంలో ఒక స్పష్టమైన పాలసీతో

Update: 2023-06-05 14:21 GMT

80 శాతం ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కే

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. పొత్తుల విషయంలో ఒక స్పష్టమైన పాలసీతో ముందుకు కదులుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పొత్తుల విషయంలో తాము క్లారిటీగా ఉన్నామని చెప్పారు. కూటములు, పొత్తులకు సిద్ధాంతాలు ఉండాలని సజ్జల అన్నారు. అధికారం కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు.. పొత్తులు పెట్టుకోవడంలో సిద్ధహస్తుడని ఎద్దేవా చేశారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబుకు జనసేన, బీజేపీ కలిసి సీఎం సీటుకు కట్టబెట్టాయని గుర్తు చేశారు. ఆ తర్వాత వాళ్లపై ఆరోపణలు చేసి చంద్రబాబు బయటకు వచ్చాడని సజ్జల విమర్శించారు. వైఎస్‌ జగన్‌కు ప్రజల్లో ఆదరణ లేదని చెబుతున్న చంద్రబాబు.. ఇప్పుడు పొత్తుల కోసం ఎందుకు తహతహలాడుతున్నారని ప్రశ్నించారు. జగన్‌కు ప్రజల్లో 80 శాతం మద్దతు ఉందన్న సజ్జల.. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లు, ఓట్లు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సహృదయ సంబంధాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.

తమకు రాజకీయాల కన్నా.. రాష్ట్ర ప్రయోజనాలే కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ వైఎస్‌ జగనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పలు సర్వే రిపోర్టుల్లో తేలిందని సజ్జల గుర్తు చేశారు. తమకు చంద్రబాబులా పొత్తుల పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఒంటరి పోరు చేసి, గత ఎన్నికల్లో కంటే ఎక్కువ ఫలితాలను సాధిస్తామని సజ్జల నమ్మకంగా చెప్పారు. అంతకుముందు కూడా చంద్రబాబుపై సజ్జల సెటైర్లు వేశారు. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయన్నారు. టీడీపీ మేనిఫెస్టోను వైఎస్‌ జగన్‌ పొగిడారని.. చంద్రబాబు తనకు తానే అనుకోవడం వింతగా, విచిత్రంగా ఉందన్నారు. 

Tags:    

Similar News