నేడు దేశ వ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు కార్మికులు దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నారు.

Update: 2022-03-28 01:33 GMT

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు, రేపు కార్మికులు దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నట్లు కార్మికసంఘాల జాయింట్ ఫోరం తెలిపింది. దేశ వ్యాప్తంగా ఈ సమ్మెలో 20 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని పేర్కొంది. అన్ని రంగాలను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేసే ఆలోచన చేస్తున్నందున కార్మికు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి.

అన్ని రంగాలు....
రోడ్ వేస్, ట్రాన్స్ పోర్ట్, విద్యుత్తు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొననుండటంతో నిత్యావసర సేవలపై ప్రభావం చూపనుంది. ఇక బ్యాకింగ్, బీమా, కోల్, స్టీల్, టెలికాం, ఆయిల్, పోస్టల్, ఇన్ కమ్ ట్యాక్స్ వంటి శాఖల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొననున్నారు. అన్ని కార్మిక సంఘాలు కలసి జాయింట్ ఫోరంగా ఏర్పడి సమ్మెకు పిలుపునివ్వడంతో విజయవంతమయ్యే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News