Narendra Modi : నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు

Update: 2026-03-31 03:08 GMT

నేడు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. గుజరాత్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. నేడు గుజరాత్ లోని సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

వివిధ ప్రారంభోత్సవాలు...
సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ ను కూడా ప్రధాని ప్రారంభోత్సవం చేయనున్నారు. 20 వేల కోట్లకుపైగా విలువైన అభివృద్ధి పనులకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్రంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News