నేటితో ముగియనున్న మావోయిస్టుల డెడ్‌లైన్
నేటితో మావోయిస్టుల డెడ్‌లైన్ ముగియనుంది
నేటితో మావోయిస్టుల డెడ్‌లైన్ ముగియనుంది. ఇప్పటికే అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరి కొందరు ఎన్ కౌంటర్లలో హతమయ్యారు. తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ లీడర్ గణపతి మాత్రం ఇంకా సరెండర్ కాలేదు. గణపతి అనారోగ్యంతో నేపాల్ లో ఉన్నారని చెబుతున్నారు.
ఆపరేషన్ కగార్ తో...
అయితే ఆపరేషన్ కగార్ కు నేటితో గడువు ముగియనుండటంతో ఇంకా ఎంత మంది మావోయిస్టులు లొంగుబాట పడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈరోజు మరికొందరు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యే అవకాశముందని చెబుతున్నారు. దేశం దాదాపు మావోయిస్టురహితంగా మారిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలిపారు.