కరోనా అంతమయ్యేది అప్పుడే : డబ్ల్యూహెచ్ఓ

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనవరల్ టెడ్రోస్ అథనోమ్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పీక్ స్టేజ్ కు,

Update: 2022-02-13 09:34 GMT

ప్రపంచమంతా మాయదారి కరోనా మహమ్మారితో అల్లాడిపోతోంది. కోవిడ్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి ప్రపంచ దేశాలు. ఎక్కడైనా.. ఏదైనా కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చిందంటే చాలు.. దాని వెనుక కోవిడ్ మూలాలున్నాయా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ ఇలా పలు రకాలుగా ప్రజలపై దాడి చేస్తోంది ఈ మహమ్మారి. ఇది ఎప్పుడు పూర్తిగా అంతరించిపోతుందా ? అని ఎదురుచూస్తున్న ప్రజలకు డబ్ల్యూహెచ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనవరల్ టెడ్రోస్ అథనోమ్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కరోనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పీక్ స్టేజ్ కు, వ్యాక్సినేషన్ కు లింక్ పెట్టారు. ఈ ఏడాది జూన్ - జులై నెలల మధ్యలో ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయితే.. కరోనా ప్రభావం కూడా తగ్గుతుందని టెడ్రోస్ అథనోమ్ పేర్కొన్నారు. అప్పుడే కరోనా పీక్ స్టేజ్ ముగిసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే జరిగితే.. ఈ ఏడాది చివరి నాటికి కరోనా మహమ్మారి ముగింపు దర్శకు చేరుకోవచ్చని పేర్కొన్నారు.



Tags:    

Similar News