Union Cabinet : నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది

Update: 2026-03-18 03:40 GMT

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.

పలు కీలక నిర్ణయాలు...
ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెిపారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, భారత్‌లో ప్రభావంపై చర్చించనున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ వంటి అంశాలపై చర్చించనున్న కేంద్రం పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశముంది.


Tags:    

Similar News