పాకిస్థాన్ చెబుతోంది నిజమే కాదు: అసదుద్దీన్
పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదని, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశమని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
పాకిస్థాన్ ఉగ్రవాద బాధిత దేశం కాదని, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దేశమని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. బీజేపీ ఎంపీ బిజయంత్ పాండా నేతృత్వంలోని అఖిలపక్ష బృందం బహ్రెయిన్‌లో పర్యటిస్తోంది. ఒవైసీ బహ్రెయిన్‌లో మాట్లాడుతూ ఉగ్రవాదంపై పాక్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై బహ్రెయిన్‌కు పూర్తి సమాచారం ఇచ్చామన్నారు.
ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్ దాడుల గురించి చెప్పామని, వీటన్నింటిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని తెలిపారు. పాకిస్థాన్‌ను తిరిగి ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్టులో చేర్చేలా మద్దతు ఇవ్వాలని బహ్రెయిన్, ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలను కోరినట్లు ఒవైసీ చెప్పారు.