Supreme Court : 370 రద్దుపై నేడు తీర్పు....దేశమంతటా హై అలర్ట్

ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు రానుంది. సెప్టంబరులో రిజర్వ్ చేసిన తీర్పును నేడువెలువరించనుంది

Update: 2023-12-11 05:30 GMT

 supreme court

ఆర్టికల్ 370 రద్దుపై నేడు సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వనుంది. సెప్టంబరులో రిజర్వ్ చేసిన తీర్పును నేడు సుప్రీంకోర్టు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలను ప్రభుత్వం చేపట్టింది. తీర్పు రానుండటంతో జమ్మూకాశ్మీర్ లోని వివిధ పార్టీలకు చెందిన నేతలను గృహనిర్భంధంలోకి తీసుకుంది. రాష్ట్రమంతటా హై అలర్ట్ ప్రకటించింది. తీర్పు ఎలా వచ్చినా అన్ని రకాలుగా ఎదుర్కొనేందుకు కేంద్ర బలగాలు సిద్ధంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కూడా పోలీసు అధికారులను హోంశాఖ అప్రమత్తం చేసింది.

కాసేపట్లో తీర్పు....
ఆర్టికల్ 370 ని రద్దు చేస్తూ బీజీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు సుప్రీకోర్టును ఆశ్రయించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి రద్దు చేయడంపై మొత్తం ఇరవై మూడు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయితే ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టంబరు 5వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించనుండటంతో దేశమంతటా ఉత్కంఠ నెలకొంది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసులో వాదనలు విని తీర్పు చెప్పబోతుంది.


Tags:    

Similar News