గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి.. కొత్త రైళ్లు వస్తున్నాయ్

దేశ ప్రజలకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. దాదాపు రెండు వందల రైళ్లను త్వరలోనే రైల్వే శాఖ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు

Update: 2025-06-18 02:51 GMT

దేశ ప్రజలకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. దాదాపు రెండు వందల రైళ్లను త్వరలోనే రైల్వే శాఖ సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రయాణం మరింత సులువుగా మారేందుకు దేశ ప్రజలకు త్వరలో మరో రెండు వందల రైళ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

పట్టాలెక్కిచేందుకు ...
కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు రైల్వే మంత్రిత్వశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ‘ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్‌ రైళ్లు, 100 మెమూ రైళ్లు, 50 అమృత్‌ భారత్‌ రైళ్లు’ అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్‌ చేశారు.


Tags:    

Similar News