షా.. కీ కామెంట్స్.. ఇప్పుడు కాదట

లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్లు వర్తించవని ఆయన తెలిపారు

Update: 2023-09-20 13:53 GMT

లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్లు వర్తించవని ఆయన తెలిపారు. మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. 2024 ఎన్నికలు జరిగిన వెంటనే జనాభా లెక్కలు, నియోజకవర్గ పునర్విభజన ప్రక్రియ చేపడతామని తెలిపారు. పారదర్శకత కోసమే డీ లిమిటేషన్ అని చెప్పారు. కావాలంటే చట్టంలో కొన్ని మార్పులు చేపడతామని తెలిపారు.

ఓటింగ్ ప్రారంభం...
దాదాపు ఏడు గంటల పాటు చర్చ జరిగిన తర్వాత మరోవైపు లోక్‌సభలో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ మొదలయింది. ఈ బిల్లులో ఓబీసీ కోటా ఉండాలని డిమాండ్ విపక్షాల నుంచి వచ్చింది. ప్రతి ఒక్క సభ్యుడికి లోక్‌సభ సిబ్బందిి స్లిప్పులు పంచారు. మహిళ రిజర్వేషన్ బిల్లును మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు. దీనిపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. రేపు రాజ్యసభలో మహిళ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ జరగనుంది.


Tags:    

Similar News